దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా కథ వివరాలను వెల్లడించారు రాజమౌళి.అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలను కలిపి ఈ కథ తయారు చేసినట్లు వెల్లడించారు.
స్వాతంత్ర సమరంకు ముందు అల్లూరి సీతారామరాజు.. ఉత్తర తెలంగాణ పోరాటవీరుడు కొమరం భీం ఒకే టైమ్‌లో పుట్టారని, అయితే ఇద్దరు కొన్నేళ్లపాటు కనిపించలేదని, అయితే అప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అనే విషయాన్ని లైన్‌గా తీసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. సినిమాలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌చరణ్.. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు. చరణ్‌కు జోడిగా ఆలియా భట్ … తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్ నటిస్తున్నారని చెప్పారు.
ఈ సినిమాలో నటించడం మా అదృష్టమని తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళితో ఇది తన నాలుగో చిత్రమని ఈ సినిమా నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుందన్నారు. రామ్‌చరణ్‌తో కలిసి తెర పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపిన ఎన్టీఆర్..నా కష్టసుఖాలు పంచుకునే క్లోజ్ మిత్రుడు చరణ్ అని తెలిపారు. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్ షాప్స్, శిక్షణ చాలా అద్భుతంగా ఉందన్నారు. ది’’
రాజమౌళితో కలిసి సినిమా చేయాలనుకున్నాను కానీ తారక్‌తో పాటు జక్కన్నతో కలిసి సినిమా చేసే అవకాశం రావడం అద్భుతమైన ఫీలింగ్ అన్నారు రామ్ చరణ్. జక్కన్న నుండి ఇంటికి రమ్మని ఫోన్ వచ్చిందని ఆయన ఇంట్లోకి వెళ్లగానే తారక్ నేలమీద రిలాక్స్ అయి కూర్చున్నారని తెలిపారు. తారక్‌కు నేనొస్తానని..నాకు తనొస్తాడని తెలియదని అలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మా ఇద్దరికి ఆర్‌ఆర్ఆర్ కథ గురించి చెప్పారని తెలిపారు చరణ్. నా సోదరుడు తారక్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళితో సినిమాను తెరకెక్కించడం అదృష్టమని తెలిపారు డీవీవీ దానయ్య. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ అహ్మదాబాద్, పుణెలో జరగనుందన్నారు. సినిమా కోసం ఎక్కడా రాజీ పడటం లేదని 2020 జులై 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు.