జూన్ 1న ‘రాజు గాడు’ విడుదల..

316
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న “రాజుగాడు” చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ మే మూడవ వారంలో జరపనున్నారు.

Raj Tarun's 'Raju Gadu' to release on June 1st

తారాగణం: రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న

కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం:” సంజనా రెడ్డి.

- Advertisement -