ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా సిల్వ స్క్రీన్ పై మెరిసిన యువ హీరో రాజ్ తరుణ్ తన రేంజ్ హిట్ అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. యువ హీరోల్లో జోష్ ఫుల్ సినిమాలను తీస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్న రాజ్ తరుణ్ ఈసారి స్టార్స్ కు పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అదే.. `రాజుగాడు`. సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా దస్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా… నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ – ”యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో మా బేనర్‌లో హాట్రిక్ హిట్స్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనతో ‘రాజుగాడు’ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. లేడీ డైరెక్టర్ సంజనారెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్‌టైనర్ ఇది. రాజ్‌తరుణ్‌ను సరికొత్త పాత్రలో చూస్తారు. రాజేంద్రప్రసాద్‌గారు, రావు రమేష్‌గారు కీలక పాత్రల్లో నటించారు. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా గత చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విధంగానే ఈ సినిమా కూడా అలరిస్తుంది” అన్నారు.
అయితే వచ్చే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ మూవీతోపాటు రామ్ చరణ్ రంగంస్థలం ఉండటంతో మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీని వేసవికి వాయిదా వేసుకున్నారు.