పద్మావతి ట్రైలర్…

176
Padmavati trailer Talk
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటి దీపికాపదుకోనె తాజాగా పద్యావతి మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతుంది. దీపికా పదుకొనే టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. ఆమె భర్త పాత్రలో షాహిద్ కపూర్.. విలన్ రోల్ లో రణవీర్ సింగ్ లు నటించారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడు ట్రైలర్ విడుదల అయింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఒక అద్భుతం అనేలా అలరించింది.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పద్మావతి ట్రైలర్ ఉంది. మూవీలో కంటెంట్ కూడా ఇంతకు మించి ఉంటుందనే ఆశలు కల్పించింది. డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ అవుతుందని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తోన్నారు.

- Advertisement -