బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 84 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి రాజ్ ఎలిమినేట్ అయ్యారు.తొలుత నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందర్నీ సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరికి ఫైమా, రాజ్ మిగలగా ఫైమా దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండటంతో అది నువ్వు వాడుకుంటావా, రాజ్ కి ఇస్తావా అని అడిగారు.
బాగా ఆలోచించి రాజ్ కి ఇస్తానంది. ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితే అని ప్రశ్నించగా మళ్ళీ ఆలోచనలో పడేసరికి రాజ్.. పర్లేదు నీ కోసం వాడుకో ఎవిక్షన్ పాస్ అని ఫైమాకి చెప్పగా తన కోసం వాడుకుంది. దీంతో హౌజ్ నుంచి రాజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ ఎవరికీ ఇస్తావు హౌజ్ లో అని నాగ్ అడగడంతో.. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, ఇనయా, కీర్తి, శ్రీహన్, శ్రీసత్యలకి పంచ్ ఇస్తానని చెప్పాడు.
ఇక తొలుత సండే ఫన్‌డేలో హౌజ్ మేట్స్ లో ఎవరైనా నలుగురివి, వారిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ని చెప్పమన్నారు. తొలు రోహిత్ మాట్లాడుతూ.. కీర్తి ఎక్కువగా బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలలో వెటకారం ఎక్కువ. ఇనయా ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుందని చెప్పారు. ఇనయా మాట్లాడుతూ.. శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది, రేవంత్ ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతాడు. రాజ్ ప్రతిదానికి నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి గేమ్ ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పింది.
కీర్తి.. రేవంత్ కి కోపం బాగా ఎక్కువ. శ్రీసత్య, శ్రీహాన్ లకి వెటకారం ఎక్కువ, రోహిత్ ఎవరితోనూ కలవడు అని చెప్పింది.ఆదిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ఆడినా నేను ఆడాను అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇనయా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ లేదు. రోహిత్ అస్సలు మాట్లాడడు అని చెప్పాడు.
ఫైమా.. రేవంత్ కి కోపం ఎక్కువ, ఇనయాకి సరిగ్గా మాట్లాడటం రాదు. రోహిత్ పర్ఫామెన్స్ గేమ్ లో కనిపించట్లేదు. కీర్తి ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంది అని చెప్పింది.శ్రీసత్య.. రోహిత్ రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌కు రియాక్ట్ అవ్వడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయా ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది.
శ్రీహాన్.. రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం అన్నిచోట్లా పనికిరాదు. రేవంత్ ఏది పడితే అది మాట్లాడతాడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెడుతుంది అని చెప్పాడు.రేవంత్.. ఫైమా ఇంకా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..