డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి సెషన్ రద్దు..

67

సౌతాంప్టన్లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజే వర్షంతో నిలిచిపోయింది. భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. అది కూడా వర్షం తగ్గినే.. ఈ చారిత్రక టెస్టు మ్యాచ్‌కు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.

ప్రస్తుతం ఈ మైదానం వర్షంతో చిత్తడిగా మారిన తీరు చూస్తే, లంచ్ లోపల మ్యాచ్ ఆరంభమ్యే అవకాశం కనిపించడంలేదు. ఇంకా జల్లు కురుస్తుండడంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తొలి సెషన్ ను రద్దు చేశారు. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.