పరవళ్లు తొక్కుతున్న గోదారి…మేడిగడ్డ గేట్ల ఎత్తివేత

381
Medigadda barrage
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలజాతరను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి గోదావరి, ప్రాణహిత నదీ జలాలు భారీగా వచ్చి చేరుకుంటుండటంతో మేడిగడ్డ నిండు కుండను తలపిస్తోంది. దీంతో 24 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 1.80 లక్షలు క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో..3 లక్షలు క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది.

మేడిగడ్డ బ్యారేజ్ నీటి సామర్థ్యం 16.37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల నీరు చేరుకుంది. దీంతో కన్నెపల్లి,అన్నారం పంప్ హౌస్ లోని మోటార్లను అధికారులు నిలిపివేశారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద 1.10 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా..అన్నారం బ్యారేజీ నీటి మట్టం 8 టీఎంసీలు కలిగి ఉంది. అన్నారం బ్యారేజ్ సామర్థ్యం 10.87 టీఎంసీలుగా ఉంది.

గోదావరి, సత్యవతి గుండం, బ్రహ్మగుండం నుంచి వరద కొనసాగుతోంది. భక్తులు, గొర్రెలకాపర్లు, రైతులు నదివైపు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేశారు.

- Advertisement -