ఆత్మహత్య చేసుకున్న ‘కేఫ్ కాఫీ డే’ ఓనర్ సిద్దార్ధ

367
VG-Siddhartha
- Advertisement -

 కేఫ్‌ కాఫీ డే వ్యవస్ధాపకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్ధ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో సెర్చ్ చేసిన పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాయడంతో సిద్దార్థ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. చనిపోవడానికి ముందు ఆయన తన డైరెక్టర్లు, ఉద్యోగులకు లేఖ రాశారు. 37 ఏళ్ల నా కృషిలో 30 వేలమందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాను.

అయితే ఇప్పుడు ఎన్నో మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నానన్నారు. ఇక తనకు పోరాడే ఓపిక లేదని.. అందుకే అన్ని వదిలేస్తున్నానని తెలిపారు. ఓ ప్రైవేట్ ఈక్విటీలో భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని తనను బలవంత పెడుతున్నారని.. ఇక ఆ ఒత్తిడిని తాను తీసుకోవాలనుకోవట్లేదని..అందుకే తాను ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారట… అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు.కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు డ్రైవర్.

vg siddartha Letter

- Advertisement -