ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటోంది.
ఇకపై వెయిటింగ్ లిస్ట్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సువిధ రైళ్లల్లో ప్రయాణికులకు కన్ఫర్మ్ టిక్కెట్ల సౌకర్యం లభించనుంది. తత్కాల్ టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు 50 శాతం మొత్తాన్ని రైల్వే అధికారులు తిరిగి చెల్లిస్తారు. తత్కాల్ టిక్కెట్ల నిబంధనల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఏసీ కోచ్ లో బెర్త్ కోసం ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
స్లీపర్ కోచ్ కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లల్లో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించబోతోన్నారు రైల్వే అధికారులు. ఇది కూడా జులై 1 నుంచి అమలులోకి రానుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లల్లో ప్రింటెడ్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు. వాటి స్థానంలో టిక్కెట్ వివరాలను ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కు అందుతుంది.
త్వరలో వివిధ భాషల్లో రైల్వే టికెటింగ్ సౌకర్యం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రైల్వేలో హిందీ,ఇంగ్లిష్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉండగా, కొత్త వెబ్‌సైట్ తర్వాత ఇప్పుడు వివిధ భాషల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 1 నుంచి శతాబ్ది, రాజధాని రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచనున్నారు.
రద్దీ సమయాల్లో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు ముఖ్యమైన రైళ్ల డూప్లికేట్ రైలు రన్నింగ్ ప్రణాళిక చేయబడింది. జూలై 1 నుంచి ప్రీమియం రైళ్లను రైల్వే పూర్తిగా నిలిపి వేయనుంది. సువిధ రైళ్లలో టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీ వాపసు చేయబడుతుంది. ఇది కాకుండా, ఏసీ-2పై రూ.100/-, ఏసీ-3పై రూ.90/-, స్లీపర్‌పై ఒక్కో ప్రయాణికుడికి రూ.60/- తగ్గిస్తారు.
ఇవి కూడా చదవండి..