Kalyan Ram: షూటింగ్ లో గాయాలు

28
- Advertisement -

‘అమిగోస్’తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘డెవిల్’ షూటింగ్ లో ఉన్నాడు. అయితే తాజాగా వైజాగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా కళ్యాణ్ రామ్ కి యాక్సిడెంట్ అయిందనే వార్తతో ఆయన అభిమానులు షాకయ్యారు.

అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో అతని కాలుపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయి. చిత్ర బృందం వెంటనే ప్రథమ చికిత్స అందించింది ,వెంటనే వైజాగ్‌లోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ‘డెవిల్ ‘ చిత్రీకరణలో కళ్యాణ్ రామ్ గాయపడ్డాడనే వార్త ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసినప్పటికీ, ఈ దుర్ఘటనలో పెద్దగా ఏం జరగలేదని తెలియడం కొంత ఊరటనిస్తోంది.

‘డెవిల్’ పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. నందమూరి అభిమానులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇన్వాల్వ్‌మెంట్‌తో మరింత ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ 30 సినిమాలో కళ్యాణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -