- Advertisement -
కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌పై రాహుల్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత‍్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎంతో హైప్ చేసిందని.. కానీ, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు మాత్రం ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ ధ్వజమెత్తారు.
అంతేకాదు.. కరోనా సమయంలో కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అశ్రద్ధ చూపిందని మండిపడ్డారు. ఇక, కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందలేదని, పేదలకు కనీస ఆదాయం కూడా రావడంలేదని అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాహుల్ విమర్శించారు.
- Advertisement -