మోదీకి తెలిసే నీట్ పేపర్‌ లీక్‌!

5
- Advertisement -

ప్రస్తుతం జరుగుతున్న ‘నీట్’ విచారణను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలపడంపై కాంగ్రెస్ నేత.. ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలీలో స్పందించారు. పేపర్ లీక్‌ను కూడా ప్రధాని “స్వయంగా పర్యవేక్షించారని” ఎద్దేవా చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు …అత్యంత ఘోరమైనవని…బాధ్యత కంటే సంచలనం కోసమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడింది.

మే 3న వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) లో పేపర్ లీక్ అయిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 12న ఈ పరీక్షను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ లీకేజీ ఉదంతాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారిస్తోంది.

శుక్రవారం ఈ విచారణకు సంబంధించిన విచారణ సందర్భంగా.. నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పరీక్ష రద్దుకు సంబంధించిన ఆందోళనలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరఫున తెలిపారు. ఈ పరిణామంపై వచ్చిన ఒక పోస్ట్‌కు స్పందిస్తూ రాహుల్ గాంధీ…. పీఎం మోదీ నీట్ పేపర్ లీక్‌ను కూడా స్వయంగా పర్యవేక్షించారు అని పేర్కొన్నారు.

Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!

- Advertisement -