మోటర్లకు మీటర్లు..ముఖరా(కే) రైతుల నిరసన

5
- Advertisement -

రైతుల ఉచిత కరెంటుకు మీటర్లు పెడితే ఇక మాకు ఉరే దిక్కు అని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చేతిలో ఉరితాళ్ళు పట్టుకొని నిరసన తెలిపిన ముఖరా(కే) రైతులు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడని, నాడు కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి తెచ్చినా నాడు కేసీఆర్ ప్రభుత్వం మీటర్లు పెట్టలేదని, నా ప్రాణం పోయినా సరే రైతుల మోటార్లకు మీటర్లు మాత్రం పెట్టనని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాడు అన్నారు.

కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఒప్పందం చేసినట్టు అనుమానం వస్తుంది. ఇక మోటార్లకు మీటర్లు పెడితే మాత్రం రైతుల బ్రతుకులు ఆగమవుతాయని, మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు మిగిలేది ఉరే అని, మీటర్లు పెడితే రైతులకు చావే దిక్కయితదని అన్నారు.

10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతులకు చాలా కష్టాలు ఉన్నాయని, రుణమాఫీ పూర్తి కాక, రైతు భరోసా పూర్తిగా రాక, పండించిన పంటలు సమయానికి కొనడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బతుకులు ఆగం అయ్యాయని, మళ్ళీ రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు ఇక మిగిలేది ఉరే అని చేతిలో ఉరితాళ్ళు పట్టుకొని ముఖరా(కే) రైతులు వినూత్న నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దత్త, మారోతి, ప్రహ్లాద్, వెంకటి, తులసిరామ్, తిరుపతి, విఠల్ మరియు రైతులు పాల్గొన్నారు.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

- Advertisement -