కాంగ్రెస్ కు షాక్..రాహుల్ చేవెళ్ల సభకు నో పర్మిషన్

235
Rahul Gandhi uttam kumar reddy
- Advertisement -

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 9న తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందు కోసం చేవెళ్లలో భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ సెంటిమెంట్ గా ఉన్న చేవెళ్ల ప్రాంతం నుంచే ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖారావంను పూరించాలని అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని మహేశ్వరం సెగ్మెంట్ పహాడిషరీఫ్ లో బహిరంగ సభ ఏర్పాటుకు గ్రౌండ్ ను సిద్దం చేశారు. అయితే తాజాగా చేవెళ్లలో రాహుల్ సభకు అనుమతి నిరాకరించారు అధికారులు.

దీంతో కాంగ్రెస్ బహిరంగ సభను శంషాబాద్ కు మార్చారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ ప్రక్కనే ఉన్న గ్రౌండ్ లో సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు రాహుల్ గాంధీ తొలిసారిగా వస్తుండటంతో భారీగా సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో నిర్వహించే ఈసభ ద్వారానే రాహుల్ గాంధీ కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. శంషాబాద్ లో జరిగే ఈసభకు భారీగా జనాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని నాయకులకు పిలుపు నిచ్చారు.

- Advertisement -