బీజేపీ వల్లే దేశం తిరోగమనం :రాహుల్‌

126
- Advertisement -

భారతదేశంను ఒక్కతాటిపైకి తేవడానికి, బీజేపీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మహాబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర సందర్భంగా తన వెంట వచ్చిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

దేశ ప్రజలను ఐక్యతగా ఉంచేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. పాదయాత్రలో రోజు 6, 7కిలోమీటర్లకు అలసట వస్తది కానీ నేను చేస్తున్న పాదయాత్రలో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా అలసట రావడం లేదన్నారు. ఉత్సాహం కలుగుతుందన్నారు. మీ ప్రేమ అభిమానం ఇలానే ఉంటే నాకు ఎలాంటి అలసట ఉండదన్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దేశంలో ప్రజలు ఇంకా పేదవారిగానే ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు. మతం పేరుతో దేశంలో విద్వేషం పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో బీజేపీ పాలనలో నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ప్రజావ్యతిరేక విధానాల వల్ల నిరుద్యోగం, ఆర్ధిక మాంద్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దీంతో లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని కార్మికులు ఉపాధి కోల్పోయాన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తామన్నారు. రైతులకు మేము అండగా ఉంటామని…రైతుల రూణమాఫీ చేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి..

డప్పు వాయించిన రాహుల్..

సోషల్‌ మీడియాను కట్టడి చేద్దాం:మోదీ

కాంతార తగ్గేదెలె..! కార్తికేయ-2 రికార్డ్ బ్రేక్

- Advertisement -