సోషల్‌ మీడియాను కట్టడి చేద్దాం:మోదీ

145
- Advertisement -

భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని దానిని గుర్తించి నిర్మూలించాలని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం, సైబర్ నేరాలు లాంటి వాటిని భారత్‌ నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో శుక్రవారం నిర్వహించిన చింతన్‌ శిబిరంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

సోషల్‌ మీడియాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయవద్దని ఆయన అన్నారు. అది తప్పుడు వార్తలతో గందరగొళం సృష్టిస్తుందన్నారు. రిజర్వేషన్ల అంశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని …దాని వల్ల హింసకు దారి తీసిందని ప్రధాని గుర్తు చేశారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేసే ముందు పదిసార్లు సరిచూసుకోవాలన్నారు.

దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నక్సల్స్‌ గన్స్‌ పట్టుకోగలరు పెన్స్ పట్టుకోగలరు. వారు యువతను తప్పుదోవ పట్టిస్తారు అని మోదీ తెలిపారు. యువత భావోద్వేగాలను వాడుకొని దేశ సమైఖ్యతను దెబ్బతీయడానికి ప్రయత్నించేవారిని ఓడించేందుకు మన దళాలు మేధోశక్తిని పెంపొందించుకోవాలన్నారు. నక్సలిజం ఘటనలను డీల్‌ చేయడానికి రాష్ట్రాల నిపుణులను పంపాలని ప్రధాని సూచించారు.

ప్రభుత్వ తుక్కు విధానం ప్రకారం పాత వాహనాలను వినియోగించడానికి దూరంగా ఉండాలని మోదీ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా బహుళ అంతస్థుల్లో పోలీసు స్టేషన్‌లు నిర్మించాలని సూచించారు. మొదటి అంతస్థుల్లో పోలీస్‌ స్టేషన్‌ నిర్వహించి…పై అంతస్తుల్లో నివాస సముదాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అప్పుడే ప్రజలకు పోలీసుల మీద విశ్వాసం పెరుగుతుందన్నారు.

దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉండాలన్నారు. రాష్ట్రాలు ఈ విషయంపై జాగ్రత్తగా ఆలోచించాలని అభ్యర్ధించారు. దేశవ్యాప్తంగా పోస్టుబాక్స్‌ను ఎలా గుర్తుపట్టగలమో పోలీస్‌ యూనిఫాంను కూడా అలానే గుర్తించగలిగేలా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

డప్పు వాయించిన రాహుల్..

ఇదేం పిచ్చి.. బైక్ పై ప్రీ వెడ్డింగ్ షూట్

జనవరిలో అందుబాటులోకి స్కైవాక్

- Advertisement -