రాఫెల్‌ ఢీల్…కేంద్రానికి సుప్రీం షాక్

240
Supreme Rafale
- Advertisement -

రాఫెల్ యుద్ద విమానాల కేసులో కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చింది సుప్రీం. రాఫెల్‌ ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎప్పుడు విచారణ చేపట్టేది త్వరలోనే చెబుతామని తెలిపింది.

రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలు భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బహిరంగ విమర్శలు గుప్పించారు. అంబానీలకు మేలు చేసేందుకే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు చేపట్టారని చెప్పారు. మోడీ పేదల చౌకీదారు కాదని అంబానీల చౌకీదారు అంటూ బీజేపీ నేతలను ఇరకాటంలో నెట్టారు.

ఇక రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2018 డిసెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం.. విచారణకు స్వీకరించొద్దని సుప్రీంకోర్టుని కోరింది. దీనిపై మార్చి 14న విచారించిన కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. రివ్యూ పిటిషన్లపై విచారణ చేస్తామని వెల్లడించింది.

- Advertisement -