- Advertisement -
రాచకొండ షీ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇప్పటివరకు 100 బాల్య వివాహలు జరగకుండా షీ టీమ్ ద్వారా ఆపగలిగామని వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన సీపీ…రాచకొండ కమిషనరేట్ లో 3 జోన్లలో కలిపి 2017 నుండి 2021 వరకు 100 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.
ఈ వంద కేసుల్లో
13 సంవత్సరాల కేసులు 3,
14 సంవత్సరాల కేసులు 6,
15 సంవత్సరాల కేసులు 20,
16 సంవత్సరాల కేసులు 31,
17 సంవత్సరాల కేసులు 40
ఉన్నాయని వెల్లడించారు. బాల్య వివాహాలు చేస్తున్న వారికి చైల్డ్ మరైజ్ ప్రోహోబిషన్ ఆక్ట్ 2006 ప్రకారం 2 సంవత్సరాల శిక్ష మరియు ఒక లక్ష రూపాయలు ఫైన్ విధించబడుతుందన్నారు.
బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం డయిల్ 100 కి గాని, మరియు రాచకొండ వాట్సప్ నెంబర్ 9490617111 మీకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు మహేశ్ భగవత్.
- Advertisement -