పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన రష్మికా..!

66
rashmika

తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా…పెళ్లిపై మనసులో మాటను బయటపెట్టింది.

ఇటీవల కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక కార్తీ నటించిన ‘సుల్తాన్‌’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన రష్మికా.. తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో

ఆకర్షించిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. తమిళ వంటకాలంటే అమితమైన ఇష్టం. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అని మనసులోని మాటను బయటపెట్టింది.