ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్.. రచనలు ఎంతో స్పెషల్

60
- Advertisement -

స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి, తన కవిత్వం, పాటల రచనతో సాహిత్యరంగంలో ఎనలేని కృషి చేసిన మహామనిషి రవీంద్రనాథ్‌ ఠాగూర్. ఇవాళ ఆయన జయంతి. దేబేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్ ఠాగూర్ 1861 మే 7న జన్మించారు. తన రచనలతో తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నారు.

భారతదేశానికి జాతీయ గీతాన్ని రచించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతిని పొందిన ఏకైక భారతీయుడు. ఠాగూర్ రచనల్లో ముఖ్యమైనవి మానసి (1890), సోనార్ తారి (1894), గితిమాలయ (1914), రాజా (1910), పోస్టాఫీసు (1912).

రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలు రాసి వాటికి సంగీతం కూడా అందించారు. జాతీయ స్వాతంత్య్రోద్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్ బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా అత‌డికి బ్రిటీష్ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. త‌న పాటల ద్వారా ప్రజల్లో చైత‌న్యాన్ని త‌ట్టిలేపేవారు. బెంగాల్ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించారు.

Also Read:కన్నడనాట మొదలైన హత్య రాజకీయాలు…!

రవీంద్రుని రచనలలో చాల గొప్పది గీతాంజలి . ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. రవీంద్రుడు బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం.

Also Read:31న బ్రాహ్మణ సదనం ప్రారంభం..

- Advertisement -