IPL 2023 :ఎస్‌ఆర్‌హెచ్ ఒడితే ఇంటికే..!

29
- Advertisement -

ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్ రైజర్స్ హైదరబాద్.. ఇక నుంచైనా మేల్కొని మెరుగైన ప్రదర్శన చేస్తుందా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు ఐపీఎల్ అభిమానులు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివర నిలిచింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ ఉన్న స్థానాన్ని బట్టి చూస్తే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే. ఇప్పటినుంచి వరుస మ్యాచ్ లు గెలిచినప్పటికి కూడా ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడవలసిన పరిస్థితి. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో హైదరబాద్ సన్ రైజర్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోతే ఇంటిమొఖం పట్టడమే తరువాయి.

Also Read:హ్యాపీ బర్త్ డే…సందీప్ కిషన్

ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ ఉన్న ఫామ్ ను చూస్తే ఆ జట్టును ఢీ కొట్టడం ఎస్‌ఆర్‌హెచ్ కు అంత తేలికైన విషయం కాదు. మరి సన్ రైజర్స్ హైదరబాద్ కీలకం గా మారిన ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్ కంటే ముందు మద్యాహ్నం 3;30 నిముషాలకు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉండి సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఈ రెండు జట్ల మద్య జరిగిన గత మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. దాంతో ఈసారి గుజరాత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు లక్నో పట్టుదలగా ఉంది. చెన్నై పై జరిగిన గత మ్యాచ్ లో గెలిచి లక్నో ఆత్మవిశ్వాసంతో ఉంది మరోవైపు గుజరాత్ కూడా గత మ్యాచ్ లో రాజస్తాన్ పై గెలిచి ఆ జట్టు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. దాంతో ఇరు జట్ల మద్య ఆసక్తికరమైన పోరు నడిచే అవకాశం ఉంది. మరి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

Also Read:ఒక మంచి కథ చేశాం: స్వప్న ప్రియాంక దత్‌

- Advertisement -