రాశి ఖన్నా పాడిన పాటకు తేజు డాన్స్ ఇరగదీశాడు..

513
rashi khanna
- Advertisement -

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ పాటను హీరోయిన్‌ రాశి ఖన్నా పాడటం విశేషం.

prati-roju-pandage

“కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా .. కనుకేమో తలకిందులుగా పడి మది మది తిరిగెనుగా .. హైరానా పడిపోయా .. హాయిని వదిలిన ఎద వలన .. ఇంకొంచెం అడిగేశా తీయని హాయిని వద్దనక .. యూ ఆర్ మై హై” అంటూ ఈ పాట సాగుతోంది. యూత్ కి నచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు. సింగర్ దీపుతో కలిసి రాశిఖన్నా ఈ పాట పాడింది. ఇక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించారు.

Raashi Khanna Turns Singer In Prati Roju Pandaage Movie..Raashi Khanna Turns Singer In Prati Roju Pandaage Movie..

- Advertisement -