గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జేసీ..

613
green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి బీజం వేసిన రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్వీకరించిన నేపథ్యంలో నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎఫ్ఓ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

JC Venkateswarlu

మొక్కలు నాటడమనే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఇప్పుడిది, దేశవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. దీనివల్ల దేశంలో విరివిగా మొక్కలు పెరిగి, వాతావరణ సమతుల్యతను ఏర్పరుస్తాయని,రేపటి తరాలకు భవిష్యత్తు కోసం ప్రతిఒక్కరూ ఛాలెంజ్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పక మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు వ్యక్తులకు ఛాలెంజ్ ఇవ్వాలని కోరారు.

JC Venkateswarlu Accepts Green Challenge

ఈ సందర్భంగా కర్నాటి వెంకటేశ్వర్లు ముగ్గురు అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. డీఎఫ్ఓ కొత్తగూడెం, తహసిల్దార్ పాల్వంచ, ఎఫ్ డి ఓ పాల్వంచ లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దాదాపు 4 కోట్ల మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమన్నారు.

- Advertisement -