క్విట్‌ ఇండియా….స్ఫూర్తి అసాధారణం

29
- Advertisement -

పరాయి పాలన లేదు. కిరాయి సార్వభౌములు లేరు. మనం స్వతంత్రులం… మేరా భారత్‌ మహాన్‌.. అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తాం. వందేమాతర గీతం.. గొంతెత్తి పాడుకుంటాం.దీని వెనుక ఎంతోమంది మహానీయుల కృషి ఉంది. అనన్యమైన పోరాటంతో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు.

ఇక దేశ స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ఉద్యమం..క్విట్ ఇండియా ఉద్యమం. వ్యాపారం పేరుతో దేశంలోకి అడుగు పెట్టి కోట్లాది మంది భారతీయులను స్వేచ్ఛకు దూరం చేసి బానిసల్లాగా పాలించారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి ఆగడాలు భరించలేక ప్రజలు ఎదురు తిరిగితే ఫలితం ఎలా ఉంటుందో విప్లవ యోధులు రుచి చూపించారు. ఇక భారత స్వాతంత్య్ర సంగ్రామం ఎన్నో పోరాటాల సమాహారం. ఉద్యమాల్లో కొన్ని విజయవంతం కాగా మరికొన్ని విఫలమయ్యాయి. ఇందులో ఒకటి క్విట్‌ ఇండియా ఉద్యమం.

1942 ఆగస్టు 8న విజయమో వీరస్వర్గమో అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన భారతీయులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్ల తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.క్విట్‌ ఇండియా అంటూ బ్రిటిష్‌ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా చాటింది. ఇదే స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అంతవరకు భారతదేశాన్ని తమ కబంధహస్తాల కిందట పాలించిన బ్రిటిషర్ల అహంకారానికి అంతమొందించిన ఘనత క్విట్‌ ఇండియా ఉద్యమానిదే. 1942 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వేలమందిని జైళ్లలోకి నెట్టి ఎన్ని చిత్ర హింసలు గురిచేసినా సంపూర్ణ స్వాతంత్య్రం సాధించేవరకు భారతీయుల దృఢ సంకల్పం చెదరలేదు.

Also Read:చేపలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయా?

- Advertisement -