అత్యంత ఆరోగ్యకరమైన మాంసాహార పదార్థాలలో చేపలు మొదటి స్థానంలో ఉంటాయి. చేపలు తినడం వల్ల శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా అందుతాయి. అందుకే వైద్యులు కూడా చేపలు తినాలని చెబుతుంటారు. ముఖ్యంగా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవని పలు అద్యయానాలు చెబుతున్నాయి. చేపలలో ఉండే ఒమేగా 3, ఫ్యాటి యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా సాల్మన్ చేపలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలట. ఇందులో ఒమేగా 3, ఫ్యాటి యాసిడ్స్ వంటి వాటితో పాటు విటమిన్ బి12, అంతే కాకుండా మినరల్స్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుందట.
ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యని పదిలంగా ఉంచుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి రోజుల్లో గుండె సమస్యలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతూ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే తినే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆకు కూరలు, కూరగాయలు వంటివాటితో పాటు చేపలు కూడా డైలీ ఆహార పట్టికలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నా మాట. చేపలు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుందట. ఇంకా గుండెకు రక్త ప్రసరణ ను సవ్యంగా జరపడంలో కూడా చేపలోని పోషకాలు ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం గుండె సమస్యలే దూరం చేయడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించడంలోనూ చేపలోని పోషకాలు ఎంతో ఉపయోగ పడతాయట.
Also Read:సీఎం రేవంత్‌ని కలిసిన సినీ ప్రముఖులు

