హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం.. పుష్పక విమానం. దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని పలకరించారు. మరి ఆ అంచనాల్ని సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టరు. మీనాక్షి (గీత్ షైౖనీ)తో పెద్దలు కుదిర్చిన పెళ్లి జరుగుతుంది. ఉద్యోగరీత్యా వేరే ఊరులో మకాం పెడతాడు సుందర్. పెళ్లైన ఎనిమిది రోజులకే మనస్పర్థలతో మీనాక్షి ఇంటిని వదిలి తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకి వెళ్లిపోతుంది. తన భార్య తనతో లేదని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని సుందర్ భావిస్తాడు. ఆమె తనతో ఉన్నట్లే అందరినీ నమ్మిస్తాడు. కొన్ని తప్పని సరి పరిస్థితుల్లో ఉన్నట్టు నటిస్తూ కొంతకాలం గడుపుతాడు. హీరోయిన్ కావాలని వచ్చి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే రేఖ (శాన్వి మేఘన)ని తన భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు మీనాక్షి ఏమైంది. ఆమె మిస్సింగ్ కేసు కోసం ఎస్సై రంగం (సునీల్) ఇన్వెస్టిగేషన్‌లో దిగాక బయటపడ్డ విషయాలేంటి అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: గత చిత్రాలతో పోలిస్తే ఆనంద్ నటన కొత్తగా ఉంది. భార్య మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్లు గీత్‌షైనీ నటన పర్వాలేదనిపించింది. శాన్వి మేఘన అల్లరి, మాటలు ఆకట్టుకుంటాయి. ఎస్సై రంగంగా సునీల్ నటన, మేనరిజం బావున్నాయి. నరేశ్, గిరి, తదితరులు పాత్రల మేరకు నటించారు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్, కామెడీ ఈ సినిమాకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్: దర్శకుడు దామోదర కొన్ని సన్నివేశాలను డీల్ చేయడంలో ఫెయిల్ అయిన భావన కలిగింది. కొన్ని సాగదీత సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే, సంగీతం సినిమాకు కొంత మైనస్.
సాంకేతిక విభాగం: కెమెరా వర్క్ బావుంది. నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.
తీర్పు: పుష్పక విమానం.. ఒక్కసారి ఎక్కొచ్చు…
విడుదల తేది: 12 నవంబర్ 2021
రేటింగ్-2.25/5
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ షైని
సంగీతం: రామ్ మిరియాల
నిర్మాతలు: గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
దర్శకత్వం: దామోదర.