తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష వీడాలి- మంత్రి గంగుల

82
- Advertisement -

యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం బేషరతుగా కొనాలని మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. యాసంగిలో వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష వీడాలి. బాబాసాహెబ్ రాజ్యాంగంలో పంటల కొనుగోలు, నిల్వ, ఎగుమతి అధికారం కేంద్రానికే ఇచ్చారు. రాష్ట్రాల బాధ్యత పెట్టుబడి సాయం, నీటి వసతిని సమర్థంగా నిర్వహిస్తున్నది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ సర్కార్ రైతు అనుకూల 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, సాగునీరుతో ఇప్పుడిప్పుడే రైతులు తెరిపిన పడుతున్నారని మంత్రి తెలిపారు.

కేంద్రం యాసంగి వడ్లు కొనం అన్న విధానంతో మళ్లీ ఎడారిలా బీడు భూములుగా తెలంగాణ మారుతది. సీఎం కేసీఆర్ పోరాట స్పూర్తితో తెలంగాణ రైతులకు అన్యాయం జరగనివ్వం.. ప్రజా స్పందనతో కేంద్రం తప్పు దిద్దుకోవాలి, యాసంగి ధాన్యం సేకరిస్తామని ఉత్తర్వులివ్వాలి అన్నారు. కేంద్రం దిగిరాకుంటే ఢిల్లీలో ప్రధాని, కేంద్రమంత్రుల ఇంటి ముందు దర్నాలు చేస్తాం.. అధికారంలోని ప్రభుత్వంతోనే దర్నా చేయించే దుస్థితికి తీసుకొచ్చింది కేంద్రం..కేంద్రం దిగివచ్చేదాక ప్రతీ ఊర్లో బీజేపీ నేతల్ని నిలదీయాలి అని మంత్రి సూచించారు.

- Advertisement -