పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పంజాబ్ భూగర్భ జలాల వెలికితీత మరియు పరిరక్షణ 2023నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నెలకు 300క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ భూగర్భ జలాలను వెలికితీస్తే పన్నులు కట్టాలని పేర్కొంది. ఇది ఫిబ్రవరి 1నుంచి భూగర్భ జలాల ఛార్జీలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ నీటి సరఫరా పథకాలు, సైనిక మరియు కేంద్ర పారామిలటరీ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి ట్రస్టులు, ఏరియా డెవలప్మెంట్ అథారిటీలు మరియు ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపును కల్పించాయి.
పంజాబ్‌ను మూడు జోన్లుగా వర్గీకరించారు. గ్రీన్ జోన్లో భూగర్భ జలాల వెలికితీత పరిమాణాన్ని బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ.4 నుండి రూ.14వరకు ఛార్జీలు వసూలు చేయనుంది. ఎల్లో జోన్లో క్యూబిక్ మీటర్‌కు రూ.6 నుంచి రూ.18వరకు, ఆరెంజ్ జోన్లో క్యూబిక్ మీటర్‌కు రూ.8 నుంచి రూ. 22వరకు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
నెలకు రూ.300 నుండి 1500క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ, రూ.1500 నుండి 15000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ, రూ.15000 కంటే ఎక్కువ 75000 క్యూబిక్ మీటర్లు, మరియు ఆపై ఎక్కువ క్యూబిక్ మీటర్లతో సహా భూగర్భ జలాల వెలికితీత పరిమాణంను మేరకు ఈ ఛార్జీలు ఉద్దేశించబడ్డట్టు నోటిఫికేషన్లో పొందుపరిచారు. అయితే వినియోగదారులకు నీటి సంరక్షణను ప్రోత్సహించడం మరియు భూగర్భ నీటి సమతుల్యతను మెరుగుపరచడం ఆ ఆదేశాల యొక్క ముఖ్య లక్ష్యమని నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…
ఏపీ రాజధాని విశాఖనే.. క్లియర్!
రాహుల్ నిర్వాకం..ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన
ఇండియా ఫస్ట్…సిటిజన్ ఫస్ట్