సూర్య , చరణ్ కాంబో సెట్ ?

15
- Advertisement -

కొందరు దర్శకులు ఎవరూ ఊహించని కొన్ని కాంబినేషన్స్ సెట్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ఓ క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఓ భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు , తమిళ రెండు భాషల్లో తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇందు కోసం సూర్య ను అప్రోచ్ అయ్యాడట హను. సూర్య నుండి అల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని టాక్.

సినిమాలో హీరోతో పాటు మరో ఇంపార్టెంట్ కేరెక్టర్ ఉందని దాన్ని రామ్ చరణ్ తో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఆచార్య లో కూడా కొన్ని నిమిషాల పాటు స్పెషల్ రోల్ చేశాడు చరణ్. సొ సూర్య అడిగితే చరణ్ చేయకుండా ఉండడు. పైగా ఈ ప్రాజెక్ట్ తనకి రంగస్థలం ఇచ్చిన మైత్రి నిర్మాతలది. తాజాగా చిరుతో కూడా ‘వాల్తేరు వీరయ్య’ నిర్మించారు.

సో అన్ని కుదిరితే సూర్య , చరణ్ కాంబో సెట్ అయినట్టే . మరి హను రాఘవపూడి చరణ్ ను ఎలాంటి పాత్రతో అప్రోచ్ అవుతున్నాడో ? తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -