ఐపీఎల్ 2020లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. కోల్ కతా విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసి ఔటైనా తర్వాత వచ్చిన గేల్ మరో ఓపెనర్ మన్‌దీప్ సింగ్ తో కలిసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మన్‌దీప్ 66 పరుగులతో రాణించగా గేల్ సిక్సర్లతో విరుచుకపడ్డాడు. గేల్ 5 సిక్స్ లతో 51 పరుగులు చేశాడు. చివర్లో గేల్ ఔటైనా అప్పటికే పంజాబ్ విజయం ఖాయమైంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 149 పరుగులు చేసింది.ఓపెనర్ శుభ్‌మన్ గిల్(57: 45 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ,మోర్గాన్(40: 25 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు ) రాణించారు. నితీశ్ రాణా,దినేశ్ కార్తీక్ డకౌట్ కాగా రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, కమ్లేశ్ నాగర్‌కోటి, పాట్ కమిన్స్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.పంజాబ్ బౌలర్లు మహ్మద్ షమీ(3/35), రవి బిష్ణోయ్(2/20), క్రిస్ జోర్డాన్(2/25) వికెట్లు తీశారు.