వేసవిలో విరివిగా దొరికే ఫలాలలో పుచ్చకాయ కూడా ఒకటి. దీనినే వాటర్ మెలాన్ అని కూడా అంటారు. ఎండాకాలంలో పుచ్చకాయను ప్రతిఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది కాబట్టి శరీరలోని ఉష్ణోగ్రతను తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. కాబట్టి పుచ్చకాయ కనిపించగానే వెంటనే లాగేస్తుంటాము. ఇందులో విటమిన్ ఏ, బి1, బి2, బి3 వంటి వాటితో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి.
ఇక ఇందులో ఉండే అమైనో యాసిడ్, సిట్రూలైన్ శారీరక చురుదనాన్ని పెంచడంలో సహాయ పడతాయి. అయితే పుచ్చకాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దీనిని అధికంగా తినడం వల్ల అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. పుచ్చకాయలో ఉండే డైసాకరైడ్స్, మోనోషకారైడ్స్, పాలియోల్స్ వంటి వాటి కారణంగా పొత్తికడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. దాంతో పుచ్చకాయ అధికంగా తినడం వల్ల కళ్ళు తిరగడం, ఉబ్బసం, గ్యాస్, వాంతులు, విరోచనలు కలిగే అవకాశం ఉంది.
ఇక పుచ్చకాయలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తద్వారా మధుమేహం ఉన్నవాళ్ళు పుచ్చకాయ పట్ల జాగ్రత వహించాలి. ఇక పుచ్చకాయ ఎక్కువగా తింటే లో బీపీ ఏర్పడే అవకాశం కూడా ఉందట. ఇక స్త్రీలు గర్భధారణ సమయంలో పుచ్చకాయ అధికంగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే చక్కెర స్థాయి కారణంగా గర్భధారణ మధుమేహానికి దారి తీస్తుంది. కాబట్టి వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి.. కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకొని పుచ్చకాయలను మితంగా తినడం శ్రేయస్కరం.
ఇవి కూడా చదవండి…