జీవో 4 ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు

68
- Advertisement -

ఇప్పటికే దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబాయ్ , బెంగుళూరు లలో 24 / 7 గంటలు షాపులు తెరిచి ఉంచే నిబంధనలు అమలులో ఉన్నాయి. జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 , తేదీ. 4 .4 .2023 ప్రకారం జారీచేసిన ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆక్ట్, 1988 పరిధి కి లోబడే అమలు అవుతాయని అధికారులు తెలిపారు.

ఈ ఉత్తర్వులు అన్ని షాప్ లకు ఆటోమేటిక్ గా వర్తించదని చెప్పారు. 24 /7 గంటలు తెరిచి ఉంచాలను కునే షాపులు ప్రత్యేక నిబంధనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కనుగుణంగా తగు అనుమతులు పొందిన అనంతరమే తమ షాప్ లను 24 /7 గంటలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ జీవో 4 అన్ని షాపులకు వర్తించవు.
*జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 తేదీ. 4 .4 .2023 ఉత్తర్వులు ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ కు వర్తించవని చెప్పారు.

ఎక్సైజ్ చట్టాలు,నిబంధనల ననుసరించి టీఎస్ బిసిఎల్, ఐ.ఎం.ఎఫ్.ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రివరీలు, A4 షాపులు, 2B బార్లు కు ప్రత్యేక బిజినెస్ సమయం ప్రకారం మాత్రమే తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు.

- Advertisement -