ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

440
Jagan Prudhvi
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై వేటు పడింది. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజ్‌ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా పృధ్వీరాజ్ పై వేటు పడింది. ఆడియో టేపు వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

కాగా ఆడియో టేపుల వ్యవహారం ఘటనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయి విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన పృథ్వీ రాజ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, పలు సంఘాలు డిమాండ్లు చేశాయి. మరోవైపు ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని చెప్పారు పృధ్వీ రాజ్. తనపై కక్షతోనే కొంతమంది ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు.

- Advertisement -