జుట్టును సహజంగా కాపాడుకోండిలా..!

46
- Advertisement -

నేటి రోజుల్లో జుట్టును కాపాడుకోవడం చాలా మందికి పెద్ద సవాల్ గా మారింది. ఎందుకంటే వాతావరణ మార్పు, జీవన విధానంలో మార్పు, తినే ఆహారంలో మార్పు వంటి కారణాలతో చిన్న వయసు లోనే జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పదేళ్ళ వయసు లోనే తెల్ల జుట్టు రావడం, 25 ఏళ్ళు దాటకుండానే బట్టతల బారిన పడడం జరుగుతోంది. దాంతో నేటి రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసు లోనే జుట్టు సమయాలు ఏర్పడడానికి చాలా కారణలే ఉన్నాయి. .

హార్మోన్ల అసమతుల్యత, విటమిన్ల లోపం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోచచ్చు. మన శరీరానికి సరైన మోతాదులో విటమిన్ ఏ, సి, బి, డి, ఇ, వంటివి లభించనప్పుడు, అలాగే జింక్, సిలినియం లోపం ఉన్నప్పుడూ జుట్టు సమస్యలు ఏర్పడతాయి. తద్వారా తెల్లజుట్టు రావడం లేదా జుట్టు జరుగుతుంది. థైరాయిడ్ తో బాధపడే వారిలో కూడా జుట్టు సమస్యలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. కాబట్టి జుట్టు సమస్యలను అదిగమించాలంటే ముఖ్యంగా ఆహార నియమాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..

ముఖ్యంగా ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను అనగా గుడ్డు, పాలు, మటన్, చికెన్ వంటివి జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయట. అలాగే ఒమేగా 3 ఉండే చేపలు కూడా ఆహార డైట్ లో చేర్చుకుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో సల్ఫర్, ఐరన్, సెలీనియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. బెర్రి, ఆరెంజ్, వంటి సి విటమిన్ కలిగిన పండ్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్ జుట్టు ను బలంగా చేస్తుంది. వీటన్నిటిని ఆహార డైట్ లో చేర్చుకోవాలని నిపుణుల సూచన. ఆహారం విషయంలో ఇలాంటి జాగ్రతలు పాటిస్తే ఎలాంటి మెడిసన్స్ పని లేకుండానే సహజ సిద్దంగా జుట్టును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read: కార్గిల్ విజయ్ దివస్..వీర జవాన్ల యాదిలో

- Advertisement -