తమిళనాడు నిర్మాతల మండలిలోని అంతర్గత విభేదాలు ఈ రోజు రచ్చకెక్కాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న విశాల్‌కు వ్యతిరేకంగా మరొక వర్గం ఆందోళన నిర్వహించింది. నిర్మాతల సంఘం భవనానికి తాళం వేసి, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. అయితే 2017లో విశాల్ టీఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి విశాల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అధ్యక్షుడిగా ఆయన పనితీరుకు వ్యతిరేకంగా పలువురు నిర్మాతలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గతంలో విశాల్‌కు మద్దతుగా ఉన్న ఆయన స్నేహితులు ఆర్కే సురేశ్, ఉదయ ఇప్పుడు వ్యతిరేకించడం గమనార్హం. విశాల్ తను చేసిన ప్రతిజ్ఞలు నిలబెట్టుకోలేదని, అధ్యక్షుడిగా అధికారాన్ని సొంత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారని నిర్మాతలు ఆరోపించారు.
అంతేకాదు సినిమాల పైరసీకి వ్యతిరేకంగా విశాల్ చేస్తున్న పనుల గురించి కూడా ప్రశ్నించారట. నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా కాకుండా విశాల్ దక్షిణ చిత్ర పరిశ్రమ ఆర్టిస్టుల అసోసియేషన్ (నడిగర్ సంఘం)కు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.