మెగాస్టార్ చిరంజీవితో దిల్ రాజు..

412
Chiranjeevi Dil Raju
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు సురెందర్ రెడ్డి ఈసినిమాకు దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్‌ నిర్మించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార ముఖ్య పాత్రల్లో నటించారు. ఈసినిమాను అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు.

ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు తెలుస్తుంది. త్వరలోనే చిరంజీవి షూటింగ్ లో పాల్గోననున్నాడని సమాచారం. అయితే చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాడట ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈవిషయం గురించి ఇప్పటికే చిరంజీవితో కలిసి చర్చించారట దిల్ రాజు. దీనికి ఆయన ఒకే చెప్పడంతో మంచి కథ కోసం వెతుకుతున్నాడు దిల్ రాజు.

- Advertisement -