బింబిసార ఓటీటీ డేట్‌ ఎప్పుడో తెలుసా?

109
dil
- Advertisement -

వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బింబిసార. కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్ వస్తుండగా వాటికి చెక్ పెట్టారు దిల్ రాజు. ఈ సినిమా 50రోజుల త‌ర్వాతే ఓటీటీలోకి రానున్న‌ట్లు దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ చిత్రం ఓటీటీలో సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌య్యే అయ్యే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్నిప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’ నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులను భారీ ధ‌ర‌కు విక్ర‌యించింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సుమారు 5 కోట్ల వ‌ర‌కు ప్రాఫిట్స్ వ‌చ్చాయి.

- Advertisement -