బే’వాచ్‌’ అంటున్న క్వాంటికో బ్యూటీ

207
Priyanka Chopra looks red hot in new Baywatch poster
- Advertisement -

ప్రియాంక చోప్రా…అందం, అభినయం రెండూ ఉన్న నటి. బాలీవుడ్‌లో ఎన్నో హిందీ సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రియాంక…. వయసు మీద పడుతున్న తనలోని  పస తగ్గలేదని నిరూపిస్తోంది. తాజాగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందాలు చూసి కుర్రకారు ఫిదా అయిపోతోంది.

హాలీవుడ్‌లో ప్రియాంకకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సిరీయల్ క్వాంటికో. ఈ సిరీయల్‌తో తనలోని వాడివేడి ఇంకా తగ్గలేదని చూపించింది. ప్రస్తుతం బాలీవుడే కాదు హాలీవుడ్ సైతం ప్రియాంక జపం చేస్తోంది. మొదటి సిరీస్ లో సింగిల్ పీస్ బికినీలో అదరగొట్టిన పీసీ.. రీసెంట్ గా ప్రదర్శితమైన క్వాంటికో సీజన్ 2 ప్రీమియర్ లో టూ పీస్ బికినీతో పిచ్చెక్కించేసింది.

క్వాంటికో టీవీ సిరీస్.. బేవాచ్ మూవీ.. బోలెడన్ని ఫోటో షూట్స్.. సెలబ్రిటీ షోలలో ఇంటర్వ్యూలు ఏ మాత్రం తగ్గడం లేదు ఈ బ్యూటీ. ఓ బిజీ షెడ్యూల్‌లోనూ తన సినిమా ప్రమోషన్స్‌ని బాగానే హ్యాండిల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రియాంక లేటెస్ట్ మూవీ బేవాచ్ లో తన కేరక్టర్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.  రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ భామ బీచ్ ఒడ్డున  అందాలను ఒలికిస్తూ ‘బ్యాడ్ గా ఉండడం కూడా చాలా మంచిదే కావచ్చు’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పెట్టింది.

మే 26న విడుదల కానున్న బేవాచ్ మూవీపై ప్రియాంక చాలా హోప్స్ పెట్టుకుంది. బేవాచ్‌లో  విక్టోరియా లీడ్స్ అనే నెగిటివ్ రోల్ చేస్తోంది. క్వాంటికో సిరీస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్న ప్రియాంక …  బేవాచ్‌ సక్సెస్‌ పైన కోటి ఆశలు పెట్టుకుంది.

- Advertisement -