వీరభద్రుడికి బంగారు మీసం…మొక్కు చెల్లించిన కేసీఆర్

276
KCR for Mahabubabad Political Top Stories
- Advertisement -

కురవి వీరభద్రస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ప్రత్యేక విమానంలో మహబూబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం … ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు తీర్దప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామికి వారికి బంగారు కోర మీసాలు సమర్పించి తెలంగాణ మొక్కు తీర్చుకున్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటంతోపాటు కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి, విజయ వాడ కనకదుర్గ మ్మ అమ్మవారికి కిరీటాలు సమర్పిస్తామని మొక్కుకున్న సంగతి తెలిసిందే. మొక్కులో భాగంగా భద్రకాళి అమ్మవారికి సీఎం బంగారు కీరిటాన్ని సమర్పించారు. దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.3.70 కోట్ల విలువ గల 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

ఇక తిరుమల శ్రీవారికి సైతం రూ. 5కోట్ల విలువైన స్వర్ణాభరణాలను స్వామివారికి సమర్పించారు.  రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. తాజాగా కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాన్ని సీఎం సమర్పించారు.

- Advertisement -