ప్రియాంక-నిక్‌ విడిపోతున్నారా…?

166
priyanka
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడు ఎదో ఒక దానిపై కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె హైలెట్ అవుతారు. తాజాగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలా నుండి చోప్రాజొనాస్ పేరును తొలగించడమే ఇందుకు కారణం. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వార్తలపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. అవన్నీ చెత్త వార్తలని, ఉత్త పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రియాంక స్నేహితురాలు కూడా ఈ వార్తలను కొట్టిపడేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసమే ప్రియాంక తన పేరును ఇలా మార్చుకున్నారని వివరించారు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్క జొనాస్ పేరును మాత్రమే తొలగించలేదని, ‘చోప్రా’ పేరును కూడా తొలగించిందని గుర్తు చేస్తున్నారు.

- Advertisement -