నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌..

72
richa

టిమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ , హెడ్ కోచ్ ద్రావిడ్‌ తన ఫస్ట్ లవ్‌ అని తెలిపింది బాలీవుడ్ నటి రిచా చద్దా. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రిచా..తనకు క్రికెట్ అంటే అభిమానం అని..నా సోదరుడు క్రికెట్‌ ఆడేవాడు. మ్యాచ్‌ ఉందంటే టీవీకే అతుక్కుపోయేదాన్ని. రాహుల్‌ ద్రవిడ్‌ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం అని తెలిపింది.

అయితే, తను రిటైర్‌మెంట్‌కు దగ్గరవుతున్న కొద్దీ క్రికెట్‌ చూడటం మానేశాను. నా ఫస్ట్‌లవ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. అందుకే తను లేని ఆటను చూడలేకపోయాను అని తెలిపిన రిచా… అయితే, ఇప్పుడు తను మరో రూపంలో డ్రెస్సింగ్‌రూంలో సందడి చేస్తున్నడు కాబట్టి.. మళ్లీ క్రికెట్‌ చూడటం ఆరంభిస్తానని రిచా పేర్కొన్నారు.

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ద్రావిడ్… ది వాల్‌గా గుర్తింపు పొందాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న అనేక సమయాల్లో సత్తా చాటి పరువు కాపాడారు. ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇవ్వకుండా ‘అడ్డుగోడ’గా నిలబడి జట్టును అనేక సార్లు విజయపథంలో నిలిపాడు ద్రావిడ్.