ఒక్కరితో ఆపను..క్రికెట్‌ టీమ్‌ని అందిస్తా: ప్రియాంక

197
priyanka
- Advertisement -

ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతో ఆపనని క్రికెట్‌ టీమ్‌ని కంటానని తెలిపింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక…తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనకు వీలైనంత ఎక్కువ మంది పిల్లలు కావాలని తెలిపిన ప్రియాంక… ఒకరిద్దరితో సరిపెట్టను. క్రికెట్ జట్టుకు సరిపోయేంత మంది పిల్లల్ని కనాలని ఉందని చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. సంస్కృతి నేపథ్యం వేరైనప్పటికీ.. తమ మధ్య సంబంధానికి ఎప్పుడూ అడ్డంకి కాలేదని చెప్పారు.లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయం నిక్‌తో గడిపే అవకాశం లభించిందన్నారు.

నిక్ లాంటి భర్త తనకు దొరకడం అదృష్టమని తెలిపిన ప్రియాంక…తనకు చాలా సపోర్ట్ చేస్తారని, ఆయన వల్లే ఈ వృత్తిలో కొనసాగుతున్నాను అని చెప్పారు.

- Advertisement -