రామ్ చరణ్ ఈజ్ బ్యాక్.!

48
ram

తాను కరోనా నుండి కోలుకున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. మరోసారి కరోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ గా నిర్దార‌ణ అయిందని తెలిపారు. కరోనా నెగెటివ్‌గా నిర్దార‌ణ అయిన విష‌యాన్ని మీతో పంచుకోవ‌డం ఆనందంగా ఉందని తెలిపిన రామ్ చరణ్‌…. మ‌ళ్లీ వ‌ర్క్ లో చేరేందుకు వేచి ఉండ‌లేక‌పోతున్నా..? మీ అంద‌రి మ‌ద్దతుకు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్‌…రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తుండగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు.