సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని : ప్రియమణి

117
Priyamani
- Advertisement -

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. జూన్ 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో ఆత్మీయ వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ… విరాట పర్వం నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇది అందరికీ స్పెషల్ ఫిల్మ్ అన్నారు. సాయి పల్లవికి తాను అభిమానినని తెలిపిన ప్రియమణి…మలర్‌గా నువ్ పరిచయమైనప్పుడు నా షోలో నువ్ వచ్చావ్.. అప్పటి నుంచి ఇప్పుడు ఇలా మనం కలిసి నటించే వరకు నీ ప్రయాణం అద్భుతంగా ఉందని తెలిపింది. నీ అభిమానులుగా మేం ఇంకా ఇలాంటి చిత్రాల్లో చూడాలని అనుకుంటున్నాం అని తెలిపారు ప్రియమణి.

పెళ్లైన కొత్తలో సినిమా నుంచి నాకు ఆయన తెలుసు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు అని చెప్పారు. ఈ సినిమాలో భారతక్క పాత్రలో నటించాను. నాకు ఎక్కువగా రానాతో సీన్లు ఉంటాయి. రానా అద్భుతమైన నటుడు అని కొనియాడింది.

- Advertisement -