అందుకే విరాటపర్వం చేశా: రానా

73
rana
- Advertisement -

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. జూన్ 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో ఆత్మీయ వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ….ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అని చాలా మంది అడిగారు. సినిమాలు అభిమానుల చప్పట్ల కోసం చేస్తుంటాం. కానీ ఆ చప్పట్ల మధ్యన ఒక్కడు నిశ్శబ్దంగా కూర్చుని దీనమ్మ ఇది నిజం కదా? అని నమ్మి చూస్తాడు. ఆ ఒక్కడి కోసం ఈ సినిమాను చేశానని తెలిపాడు రానా.

తెలంగాణలో కట్టెపుల్లను పట్టుకున్నా కవిత్వం వస్తుందని… అది ముమ్మాటికి నిజం అన్నారు. ఇలాంటి కథలెన్నో మేం చెప్పాలని అనుకుంటున్నాం. ఈ సినిమా జూన్ 17న వస్తుంది.మీ ప్రేమ మా అందరికీ కావాలన్నారు.

- Advertisement -