కీర్తి సురేష్ స్ధానంలో ప్రియమణి

539
Keerthi Suresh Priyamani
- Advertisement -

మహానటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ అందాల భామ ప్రస్తుతం తెలుగు, తమిళ్ , కన్నడ సినిమాల్లో బిజీగా ఉంది. అయితే కీర్తి సురేష్ బాలీవుడ్ లో మంచి ఆఫర్ ను చేజార్చుకుంది. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం మైదాన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అజయ్ దేవగణ్ సరసన మొదట కీర్తి సురేష్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో కీర్తి అజయ్‌ దేవగణ్‌ భార్యగా కనిపించాల్సి ఉంది. అయితే.. ప్రాజెక్ట్‌ అనుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కీర్తి సురేష్ చాలా వరకు బరువు తగ్గారు.

దీంతో అజయ్‌ సరసన కీర్తి మరీ చిన్న అమ్మాయిల కనిపిస్తోందట. దీంతో ఈ మేరకు చిత్రబృందంతో చర్చించిన కీర్తి ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ప్రియమణిని సంప్రదించారు చిత్రయూనిట్. ప్రియమణి వెంటనే ఒప్పేసుకుంది. ఈ సినిమా 1952 నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈమూవీకి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 27న ఈసినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.

- Advertisement -