అల్లరి నరేష్ @ 57…ఫస్ట్ లుక్

647
naandi
- Advertisement -

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నాంది. మహర్షి తర్వాత నరేష్ హీరోగా చేస్తున్న చిత్రం ఇది. సినిమా ఇవాళ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది.

నరేష్ నటిస్తున్న 57వ సినిమా ఇది. నరేష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. సినిమా టైటిల్ లుక్‌తో పాటు న‌రేశ్ లుక్‌ను కూడా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎస్‌.వి. 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాంది అనే టైటిల్‌ని ఖరారు చేయగా నరేష్ లుక్ అదిరిపోయింది. నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది.

- Advertisement -