ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా హవా..!

220
- Advertisement -

ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్‌ లవ్‌’లోని ‘మాణిక్య మలయార పూవి’ పాటతో ఒక్కరోజులో ప్రియ ఫేమస్‌ అయిపోయింది. ఒక చిన్న వీడియోతో… ఇంత స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయచ్చన్న సంగతి ప్రియా ప్రకాష్ వారియర్ వల్లే సినీ జనాలకు అర్థమై ఉంటుంది. కనీసం ఒక్క సినిమా కూడా ఇంకా విడుదలవ్వక ముందే… ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చేశారు. ఆమె పోస్టు పెడితే చాలు స్టార్ హీరోల కన్నా… ఎక్కువ సంపాదన అందుకుంటోంది.

Priya Prakash Varrier charges a bomb per Internet Post

ప్రియా ఫాలోవర్ల సంఖ్య ఇన్ స్టాగ్రామ్ లో 45 లక్షలు. ఇన్ స్టాగ్రామ్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ కు కూడా అంతమంది ఫాలోవర్లు లేరు. ప్రియ పెట్టే పోస్టుల కోసం ఎదురు చూసే వాళ్లు ఎంతో మంది. ఆమె పెట్టే ఒక్క పోస్టు వల్ల ప్రియకు 8లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అంతే ఏ రేంజిలో వాటికి లైకులు పడతున్నాయో – షేర్లు అవుతున్నాయో చూడండి. తమన్నా… తాప్సీ… వంటి హీరోయిన్లు… అఖిల్… రానా వంటి హీరోలు పెట్టిన పోస్టు కూడా నాలుగు లక్షలే పలుకుతున్నాయి. కానీ ప్రియా రేంజ్ మాత్రం ఆ స్థాయిలో ఉంది. బాలీవుడ్ హీరోల కన్నా కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ప్రియా హవానే సాగుతోంది.

మలయాళ సినిమా ఒరు అడార్ లవ్ లో హీరోయిన్గా తెరంగేట్రం చేస్తోంది ప్రియా. అందులో ఓ పాటను ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేశారు. అది కూడా కేవలం 26 సెకన్ల వీడియో. అందులో కనుబొమ్మలతో డ్యాన్సు చేయించి… కొంటెగా కన్నుకొట్టి… కుర్రాడిని పడేసింది. ఆ వీడియో ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. స్టార్ హీరోయిన్లకు లేనంత క్రేజ్ ప్రియకు వచ్చేసింది. అప్పుడే ఇతర భాషల నుంచి ఆఫర్లు కూడా భారీగానే వస్తున్నాయి.

- Advertisement -