‘టాక్సీ వాలా’ వస్తున్నాడు..?

291
- Advertisement -

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఓ అరడజను వరకూ సినిమాలు వున్నాయి. కంటెంట్ పరంగా వేటికవే కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, వాటిని పూర్తి చేసే పనిలో విజయ్‌ బిజీగా వున్నాడు. విజయ్‌ చేస్తోన్న సినిమాల జాబితాలో ‘టాక్సీ వాలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ నుంచి అందిన ప్రత్యేక సమాచారం మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్ మే 18కి ఫిక్స్ చేసారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్పివుంది.

Vijay Devarakonda Taxi Wala Movie release Date

అయితే ఈ మూవీ జర్నీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే థ్రిల్లర్ మూవీ గా ఉండబోతోందని టాక్. ఈమూవీకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో ది ఎండ్ అనే సినిమాను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలను అందుకునేలా చాలా విభిన్నంగా ‘టాక్సీ వాలా’ను తెరకెక్కించినట్టు చెబుతున్నాడు రాహుల్.

యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను .. ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారట. ‘అర్జున్ రెడ్డి’ తరువాత విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ మరింత పెరుగుతుందనేది యూనిట్ సభ్యుల మాట.

- Advertisement -