ప్రిన్స్ ఫిలిప్‌ అంత్యక్రియలకు 30 మంది అతిథులు..

87
prince

క్వీన్ ఎలిజ‌బెత్ భ‌ర్త‌, ప్రిన్స్ ఫిలిప్ అంత్య‌క్రియ‌లు రేపు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. 94 ఏళ్ల డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బ‌ర్గ్ ఫిలిప్ అంతిమ సంస్కారాల‌ను విండ్స‌ర్ క్యాజిల్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

గెస్ట్ లిస్టులో ఉన్న 30 మందితో పాటు క్యాంట్‌బ‌రీ క్రైస్త‌వ మ‌త‌పెద్ద‌లు అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హిస్తారు. ప్రిన్స్‌కు ఇష్ట‌మైన పాట‌ల్ని ఓ బృందం పాడ‌నున్న‌ది. ప్రిన్స్ ఫిలిప్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ హాజ‌ర‌వుతున్నారు. ల్యాండ్ రోవ‌ర్ వాహ‌నంలో ఫిలిప్ శ‌వ‌పేటిక‌ను తీసుకెళ్ల‌నున్నారు.